: దేశంలోనే ఉత్తమ గ్రామంగా పొట్లదుర్తి... ప్రధాని నుంచి అవార్డు అందుకున్న ఆ గ్రామ సర్పంచ్
దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కడప జిల్లాలోని పొట్లదుర్తి గ్రామం ఎంపికైంది. ఈ మేరకు ఉత్తమ గ్రామ పురస్కారాన్ని ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఆ గ్రామ సర్పంచి వెంకటరంగయ్య ఢిల్లీలో అందుకున్నారు. మరో విశేషం ఏమిటంటే, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ స్వగ్రామమే ఈ పొట్లదుర్తి. ఏపీలో పొట్లదుర్తితో పాటు మరో 11 గ్రామాలు, తెలంగాణలో ఐదు గ్రామాలకు జాతీయ పంచాయత్ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను అందజేసింది.