: రైతు ఆత్మహత్యపై కేజ్రవాల్ స్పందన... క్షమించమన్న ఢిల్లీ సీఎం
భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో గజేంద్ర సింగ్ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రైతు చనిపోయాక కూడా తన ప్రసంగం ఆపకుండా కొనసాగించడం తప్పని, ఇందుకు తనను క్షమించమంటూ కేజ్రీ కోరారు. "నేను తప్పు చేశాను. ఆ ఘటన తరువాత నేను మాట్లాడకుండా ఉండాల్సింది. ఇది నేను అప్పుడాలోచించలేదు. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణ చెబుతున్నా" అని కోరారు. రైతు ఆత్మహత్యపై పలువురి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేజ్రీ ఆంగ్ల మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ రెండు రోజుల తరువాత ఆ వ్యవహారంపై స్పందించారు. "వాస్తవానికి అతను ఆత్మహత్యకు పాల్పడతాడని ఎవరూ ఊహించలేదు" అని పేర్కొన్నారు.