: యూరప్ లో మాయమై, అమెరికాలో తేలిన 250 సంవత్సరాల నాటి పుస్తకం


రోమ్ లో చోరికి గురైన సంవత్సరం తరువాత అర్జెంటీనాలో వెలుగులోకి వచ్చిందో 18వ శతాబ్దం నాటి విలువైన పుస్తకం. సెయింట్ పీటర్ బాసిలికాకు చెందిన ఈ పుస్తకం 1748 నాటిది. రోమ్ లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి ఇది దొంగిలించబడింది. సదరు లైబ్రరీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్ లో పుస్తకం ఉన్నట్టు గుర్తించిన అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ లో ఈ పుస్తకం విలువ సుమారు రూ. 2.31 లక్షల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News