: తమ వారసుడికి పేరు పెట్టిన అజిత్, షాలినీ


గత నెలలో పండంటి బాబుకు జన్మనిచ్చిన షాలిని, అజిత్ దంపతులు బిడ్డ నామకరణాన్ని వైభవంగా నిర్వహించారు. తమ బిడ్డకు 'అద్వేక్' అని పేరు పెట్టినట్టు అజిత్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీరిద్దరూ 2000 సంవత్సరంలో వివాహం చేసుకోగా, వీరికి 7 సంవత్సరాల పాప అనౌష్క ఉన్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న వారిలో అజిత్, షాలినీ దంపతులు ముందు నిలుస్తారు. కాగా, అజిత్ నటించిన 'యెన్నై అరిందల్' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

  • Loading...

More Telugu News