: నన్ను క్షమించండి: ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తనను క్షమించాలని కోరారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా కొన్నిసార్లు తమవారిపై కూడా దాడులు చేయాల్సి వచ్చిందని, ఇందుకు మృతుల కుటుంబీకులు మన్నించాలని కోరారు. పాకిస్థాన్ లో ఈ సంవత్సరం జనవరిలో జరిపిన డ్రోన్ దాడుల్లో ఒక అమెరికన్, ఒక ఇటాలియన్ మరణించిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. అల్-ఖైదా ఉగ్రవాదులు వీరిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లగా, అమెరికా జరిపిన దాడుల్లో వీరిద్దరూ మరణించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా, ఉ్రగవాదంపై జరుగుతున్న పోరుకు పూర్తి బాధ్యత తనదేనని అన్న ఒబామా, అమెరికా ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.