: నవ్యాంధ్ర రాజధానికి తొలి పరిశ్రమ... అమరావతిలో ‘కింగ్ లాంగ్’ బస్సుల తయారీ ప్లాంట్!


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఇంకా పునాది రాయే పడలేదు. అప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు బారులు తీరుతున్నాయి. అమరావతిలో తొలి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు బస్సుల తయారీ సంస్థ కింగ్ లాంగ్ ముందుకొచ్చింది. నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కింగ్ లాంగ్ కంపెనీ డైరెక్టర్ రే, జనరల్ మేనేజర్ వరప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు అమరావతిలో తమ ప్లాంట్ ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే, నెల్లూరులోనూ మరో ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వారు ప్రకటించారు. అమరావతిలో ఏర్పాటు కానున్న కింగ్ లాంగ్ బస్సు తయారీ ప్లాంట్ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.

  • Loading...

More Telugu News