: బ్రిటన్లో 'కామపిశాచి' కోసం వేట


అతడి పేరు స్టీఫెన్ ముండెన్. వయసు 54 సంవత్సరాలు. అతని పేరు వింటే యూకేలో బాలికలు ఉలిక్కిపడతారు. ఎందుకంటే, అతనో మానవ మృగం. అభంశుభం తెలియని అమ్మాయిలే అతని టార్గెట్. వారితో క్రూరంగా లైంగిక వాంఛలు తీర్చుకోవడం అతని నైజం. నరనరానా కామంతో రగిలిపోయే అతగాడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. దీంతో, బ్రిటన్ పోలీసులకు కంటిమీద కునుకు దూరమైంది. పెద్ద ఎత్తున పోలీసు బృందాలు గాలింపు చర్యల్లో తలమునకలయ్యాయి. చికిత్స కోసం ముండెన్ ను వించ్ ఫీల్డ్ లోని ఓ సైకియాట్రిక్ సెంటర్లో చేర్చగా, అక్కడి నుంచి తప్పించుకున్నాడట. మూడేళ్ల చిన్నారిని 'లైంగికంగా తాకాడన్న కారణంగా అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ కామపిశాచి 'సెక్స్ డ్రైవ్' లో భాగంగా మరికొందరు అమ్మాయిలపై దాడి చేసే అవకాశాలున్నాయని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో, పలు గెటప్పుల్లో అతడి ఫొటోలను విడుదల చేసి అందరినీ అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News