: ఐపీఎల్ నుంచి షమీ ఔట్


ఐపీఎల్ సీజన్-8 నుంచి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వైదొలిగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గతనెలలో ముగిసిన ప్రపంచకప్ సందర్భంగా షమి మోకాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ గాయం మరోసారి తిరగబెట్టడంతో షమీ ఐపీఎల్ కు దూరమైనట్టు బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్ సీజన్-8లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ స్థానంలో ఇంకొక ఆటగాడ్ని తీసుకునేందుకు ఐపీఎల్ సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో షమీ స్థానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మరో వ్యక్తిని తీసుకోనుందని సమాచారం. కాగా, షమీ వైదొలగడంతో ఢిల్లీ బౌలింగ్ విభాగం కొంత బలహీనం కానుంది.

  • Loading...

More Telugu News