: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కాటసానికి గాయాలు... లారీ యజమాని, డ్రైవర్ ను తీసుకెళ్లిన అనుచరులు
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్నూలు జిల్లా బేతంచర్ల ఘాట్ రోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కాటసాని స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రాణాలకేమీ ఆపద వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదానికి కారణమైన లారీని కాటసాని అనుచరులు ఆపివేశారు. ఆ లారీ యజమానిని, డ్రైవర్ ను తమతో తీసుకెళ్లారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.