: టీఆర్ఎస్ నేతలంతా టీడీపీలో పుట్టినోళ్లే: ఎర్రబెల్లి
ఓవైపు తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టగా, అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు 'కేసీఆర్ అండ్ కో'పై మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీలో పుట్టినవాళ్లేనని అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని, టీడీపీని ఆంధ్రా పార్టీ అని ఎవరన్నా అంటే వారిని చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు.