: నాలుగైదు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం: భవిష్యత్ ప్రణాళిక వెల్లడించిన చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భవిష్యత్ ప్రణాళికలను మహబూబ్ నగర్ సభలో వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నాలుగైదు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తెలిపారు. టీడీపీని జాతీయపార్టీగా రూపొందిస్తామని స్పష్టం చేశారు. తనకు ఏపీ, తెలంగాణ రెండూ ముఖ్యమేనని అన్నారు. తెలుగు రాష్ట్రాలను శక్తిమంతమైన రాష్ట్రాలుగా తయారుచేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. తెలుగుజాతి ఎప్పటికైనా కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పాలమూరు కార్యకర్తలకు రుణపడి ఉన్నానని అన్నారు.