: ఎర్రచందనం స్మగ్లర్ సౌందరరాజన్ కు మే 7 వరకు రిమాండ్
ఎర్రచందనం స్మగ్లర్ సౌందరరాజన్ ను పోలీసులు ఈరోజు చిత్తూరు మూడవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతనిపై ఉన్న కేసులను పరిశీలించిన మేజిస్ట్రేట్ మే 7 వరకు రిమాండ్ విధించారు. వెంటనే రాజన్ ను పోలీసులు చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. మూడు రోజుల కిందట భూటాన్ సరిహద్దులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.