: టీడీపీని ఖాళీ చేస్తామన్నారు... చివరికి పావురాల గుట్టలో పావురమై పోయారు: రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ లో టీడీపీ భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా మాట్లాడారు. టీడీపీని ఖాళీ చేయడం ఎవరివల్లా కాదని అన్నారు. టీడీపీని తుడిచి పెట్టేస్తామని చెప్పిన వైఎస్ రాజశేఖరరెడ్డి పావురాలగుట్టలో పావురమై పోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు, కేసీఆర్ ముత్తాత వచ్చినా టీడీపీకి ఏమీకాదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సభను ప్రజలు చూస్తారనే, తెలంగాణ జిల్లాల్లో పవర్ కట్ కు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. నేతలను కొనగలరేమో కానీ, కార్యకర్తలను ఎప్పటికీ కొనలేరని ఉద్ఘాటించారు.