: ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్ధానం... కడప జిల్లా చివరి స్థానం
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచిందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 59 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో ఉందని చెప్పారు. కాగా ఏపీ ఇంటర్ ఫలితాల్లో కూడా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 67 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 59 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థుల కోసం మే 25 నుంచి జూన్ 2 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.