: డిసెంబర్ లో కాదు... జూన్ లోనే షాహిద్ కపూర్ వివాహం
బాలీవుడ్ హ్యాండ్ సమ్ బాయ్ షాహిద్ కపూర్ కి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం జరగనుందని గత నెలలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడా తేదీ మారింది. జూన్ లోనే షాహిద్, ఢిల్లీకి చెందిన మీరా రాజ్ పుత్ లు ఒక్కటవనున్నారని తెలుస్తోంది. ఆంగ్ల పత్రిక డీఎన్ఏ ప్రచురించిన వార్త ప్రకారం, ఇప్పటికే షాహిద్ 'ఫర్జి' అనే కొత్త చిత్రాన్ని ఒప్పుకున్నాడు. అయితే జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించడం తనకు కుదరదని ఆ సినిమా దర్శకులు రాజ్ నిడుమోరు, కృష్ణ డీకేలకు చెప్పాడట. దానిపై రాజ్ మాట్లాడుతూ, "'ఫర్జి' షూటింగ్ తప్పకుండా వాయిదా పడుతుంది. ముందు జూన్ లో షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నాం. అయితే షాహిద్ వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త మమ్మల్ని చాలా విస్మయపరిచింది. ఆ నెలలోనే తన వివాహం జరగనుంది. అందుకే షెడ్యూల్ పై మళ్లీ ఆలోచిస్తాం" అని వెల్లడించారు.