: సల్మాన్...29న కోర్టుకి రా: జోథ్ పూర్ కోర్టు


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఈ నెల 29న న్యాయస్థానం ముందు హాజరుకావాలని రాజస్థాన్ లోని జోథ్ పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1998లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సహనటీనటులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్టు సల్మాన్ పై కేసు నమోదైంది. దానికి అనుబంధంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నట్టు కూడా కేసు నమోదైంది. జోథ్ పూర్ కోర్టులో ఈ రోజు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా, న్యాయస్థానానికి ఆయన హాజరుకాలేదు. సల్మాన్ న్యాయవాది, ఆయన సోదరి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు తీసుకున్నారు. దీంతో ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయస్థానం సల్మాన్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News