: ఆసుపత్రి సిబ్బందిపై దాడి కేసులో ఆరు నెలల జైలు శిక్ష!


దివంగత ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ అనుచరులు ఏడుగురికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. 2007లో అప్పటి ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ తన అనుచరులతో కలిసి నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది, వైద్యులపై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం దివంగత ఎమ్మెల్యే అనుచరులు ఏడుగురికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News