: పరుగు తీస్తే కన్యత్వం పోతుందట!
ఆస్ట్రేలియాలోని ఓ ఇస్లామిక్ కళాశాల విద్యార్థినులపై విచిత్రమైన నిషేధం విధించింది. అమ్మాయిలు పరుగు పందాల్లో పాల్గొనరాదని మెల్బోర్న్ లోని అల్ తక్వా కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశించారు. అలా చేస్తే కన్యత్వం పోతుందని పేర్కొన్నారు. దీనిపై ఆస్ట్రేలియాలో దుమారం రేగింది. విక్టోరియా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జేమ్స్ మెలినో మాట్లాడుతూ... ఆ విధమైన నిషేధం విధించడం నిజమే అయితే, అది ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై పాఠశాలల రెగ్యులేటర్, విక్టోరియా రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్ అథారిటీని విచారణ జరపాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. అల్ తక్వా కళాశాల ప్రిన్సిపాల్ ఒమర్ హల్లాక్ తీరుపై ఓ మాజీ ఉపాధ్యాయుడు ప్రభుత్వానికి లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలు అధికంగా పరిగెడితే, వారు కన్యత్వం కోల్పోతారని ప్రిన్సిపాల్ భావిస్తున్నాడని, అందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని ఆయన నమ్ముతున్నాడని మాజీ ఉపాధ్యాయుడు తన లేఖలో పేర్కొన్నారు.