: తిరుమల నడకదారిలో బొమ్మ తుపాకీ కలకలం
తిరుమల నడకదారిలో తుపాకీ కలకలం రేగింది. ఓ భక్తుని బ్యాగులో తుపాకీ, షెల్స్ లభించాయి. జీఎంసీ చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, కొండపైకి వస్తున్న ఓ భక్తుడి వద్ద ఇవి దొరికాయి. దీంతో, భద్రత సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అటు, ఇతర భక్తులు హడలిపోయారు. అయితే, అతడిని గంటపాటు ప్రశ్నించి వదిలేశారు. విచారణలో అతడి వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అని తేలింది.