: ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం... అడ్డుకున్న దళిత సంఘాల నేతలు


దళితులను అవమానించేలా సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రోజుల కిందట పలు దళిత సంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఆమెపై కేసు నమోదుకు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ వివాదమే తాజాగా ఆమెకు తన సొంత నియోజకవర్గం నగరిలో చేదు అనుభవం ఎదురయ్యేందుకు కారణమైంది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లిన రోజాను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. దళితులను అవమానించిన రోజా అంబేద్కర్ కు పూలమాల వేయడమేంటని నిలదీశారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు దళిత నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా రోజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన వెంటనే విగ్రహానికి దళిత నేతలు క్షీరాభిషేకం చేశారు.

  • Loading...

More Telugu News