: కోరిన పాట పాడలేదని గాయనిని కాల్చి చంపిన యువకుడు
ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువకుడు, తాను కోరిన పాట పాడలేదన్న కోపంతో గాయకురాలిని కాల్చి చంపాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని దయా చాప్రా గ్రామంలో జరిగింది. నిందితుడు బబ్లూ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌబీస్ (24) పరగణాకు చెందిన పియూ (23) అనే ఆర్కెస్ట్రా గాయకురాలు పాటలు పాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలో బబ్లూ ఓ పాట పాడాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన బబ్లూ నేటి తెల్లవారుఝామున ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. పియూ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.