: శేషాచలం ఎన్ కౌంటర్ పై ముగిసిన ఎన్ హెచ్ఆర్సీ విచారణ
తిరుపతిలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ ముగిసింది. కాల్పుల ఘటనా స్థలికి ఎన్ హెచ్ఆర్సీ బృందం వెళ్లాలని చైర్మన్ నిర్ణయించారు. అంతేగాక ఎదురుకాల్పుల్లో పాల్గొన్న పోలీసులు, సిబ్బంది వివరాలు, ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసుల వివరాలు కూడా ఇవ్వాలని హక్కుల సంఘం ఆదేశించింది. కాగా ఇంతపెద్ద ఎన్ కౌంటర్ జరిగితే న్యాయమూర్తితో విచారణ జరిపించకుండా రెవెన్యూ అధికారులతో ఎలా దర్యాప్తు చేయిస్తారని అంతకుముందు ఎన్ హెచ్ఆర్సీ పోలీసులను ప్రశ్నించింది.