: 50 ఏళ్ల వయసులోనూ 'ప్రపంచపు అత్యంత అందగత్తె'!
ఈ ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరు? 2015 సంవత్సరానికిగాను 'వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్'గా 50 ఏళ్ల హాలీవుడ్ సుందరి శాండ్రా బులక్ ఎంపికైంది. పీపుల్స్ మేగజైన్ నిర్వహించిన పోల్ అనంతరం శాండ్రాను అత్యంత అందగత్తెగా ఎంపిక చేసినట్టు ఎన్ బీసీ తెలియజేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శాండ్రా సైతం ఆశ్చర్యపోయింది. "అవునా? నిజంగా?... నాక్కూడా ఇప్పుడే తెలిసింది. ఇది చాలా హాస్యాస్పదం" అని వ్యాఖ్యానించింది. నిజమైన సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదని, మంచి వ్యక్తిత్వం కలిగివుండటమని అని అంటోంది శాండ్రా.