: ఏపీ, తెలంగాణలో కాల్పులపై హైదరాబాదులో ఎన్ హెచ్ఆర్సీ విచారణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాదులో విచారణ జరుపుతోంది. ఈ సందర్బంగా పోలీసులు ఎదురుకాల్పులపై ఎన్ హెచ్ఆర్సీకి నివేదిక సమర్పించారు. ఈ విచారణకు కార్యదళ సిబ్బంది సహా పోలీసులు కూడా హాజరయ్యారు. ఈ నెల మొదట్లో ఏపీలో శేషాచలం ఎన్ కౌంటర్, తెలంగాణలో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఘటనలపై హైకోర్టులోనూ కేసు నడుస్తోంది.