: ఈ 'నిందా క్రీడ' ఆపండి: రాజకీయ నేతలకు షారూఖ్ సలహా
ఏవైనా ఘటనలు జరిగితే, రాజకీయ లబ్ధి కోసం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడాన్ని ఆపాలని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సూచించారు. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలో వేలాది మంది చూస్తుండగా, ఒక రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై షారూఖ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. "ఎవరూ తమ జీవితాన్ని అంతం చేసుకోవాలని భావించి ఆత్మహత్యకు పాల్పడరు. వారు పడుతున్న బాధకు ముగింపు కోసమే ఇలా చేస్తారు. ఒక్క క్షణం సమయం కేటాయించి ఆ బాధను పంచుకోండి. ప్రయోజనాల కోసం చూడొద్దు. ఈ 'నిందా క్రీడ' ఆపండి" అని వ్యాఖ్యానించాడు. కాగా, రాజకీయ పార్టీలు రైతు ఆత్మహత్యకు మీరు కారణమంటే, మీరే కారణమంటూ విమర్శలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే.