: శంషాబాదులో కేజీలకొద్ది బంగారం... ఇద్దరు మహిళల అరెస్ట్
అక్రమ మార్గాల్లో దేశంలోకి తరలివస్తున్న బంగారానికి శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా మారుతోంది. అరబ్ దేశాల నుంచి వస్తున్న విమానాల్లో కేజీల కొద్ది బంగారం దేశానికి తరలివస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు లెక్కకు మిక్కిలి కేసులు నమోదు చేశారు. తాజాగా నేటి ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానం నుంచి దిగిన మహిళలు సమీర, సింధియాల లగేజీని సోదా చేసిన కస్టమ్స్ అధికారులు, అందులో 7 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. సదరు బంగారానికి సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.