: టాలీవుడ్ హీరోయిన్ పై ‘ఎర్ర’ కేసు... ఆమె బ్యాంకు ఖాతా నుంచి స్మగ్లర్లకు డబ్బెళ్లిందట!


ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో రోజుకో ఆసక్తికర అంశం వెలుగు చూస్తోంది. ఇప్పటిదాకా ఈ వ్యవహారంలో పురుషులపైనే కేసులు నమోదు కాగా, తొలిసారిగా ఓ మహిళపై కేసు నమోదైంది. అది కూడా టాలీవుడ్ లో హీరోయిన్ గా చెలామణి అవుతున్న నటిపై ఈ కేసు నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ లో ‘ప్రేమ ప్రయాణం’ చిత్ర హీరోయిన్ నీతూ అగర్వాల్ పై కేసు నమోదైంది. సదరు చిత్ర నిర్మాత, ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నేత, చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలితో ఆమె సహజీవనం సాగిస్తున్న వైనం నిన్న వెలుగుచూసింది. తాజాగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి మస్తాన్ వలి సహా పలువురు ఎర్రచందనం స్మగ్లర్లకు నిధులు తరలివెళ్లాయట. ఈ మేరకు ఆమె బ్యాంకు ఖాతాను పరిశీలించిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం హైదరాబాదు, బెంగళూరు, ముంబైకి ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లి గాలింపు జరుపుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News