: చివర్లో వడివడిగా వికెట్లు కోల్పోయిన చెన్నై
భారీ స్కోరు దిశగా సాగుతుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ చివర్లో వడివడిగా వికెట్లు కోల్పోయింది. దీంతో, 200 మార్కును చేరుకోలేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సొంత పిచ్ పై రాణించడంతో చెన్నై బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆ జట్టు చివరి 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 47 పరుగులే సాధించింది. రైనా 32 బంతుల్లో 62 పరుగులతో ధాటిగా ఆడాడు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ 39 పరుగులు చేశాడు. డు ప్లెసిస్ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో చహల్ కు 3 వికెట్లు దక్కాయి. అబ్దుల్లా 2 వికెట్లు, స్టార్క్, పటేల్, వీస్ తలో వికెట్ తీశారు.