: భారీస్కోరు దిశగా చెన్నై సూపర్ కింగ్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు చెన్నై ఆదిలోనే విధ్వంసక బ్యాట్స్ మన్ మెక్ కల్లమ్ వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్... సురేశ్ రైనాతో కలిసి స్కోరు బోర్డును ముందుకు ఉరికించాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. క్రీజులో రైనా, ధోనీ ఉన్నారు.