: ఢిల్లీలో రైతు ఆత్మహత్యపై ప్రధాని స్పందన
ఢిల్లీలో ఆప్ ర్యాలీ సందర్భంగా రాజస్థాన్ కు చెందిన గజేంద్ర అనే రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దేశంలో రైతు ఒంటరి కాదని, తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని తెలిపారు. గజేంద్ర మృతితో దేశం విషాదంలో మునిగిపోయిందని ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా, సీపీఐ నేతలు రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ, వెంకయ్యనాయుడు కార్పొరేట్ల మోజులో వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని నారాయణ విమర్శించారు.