: కాలినడకన కేదార్ నాథ్ ఆలయానికి రాహుల్!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన వెళ్లనున్నారు. గురువారం డెహ్రాడూన్ చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి శుక్రవారం కేదార్ నాథ్ కు నడిచి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా, రాహుల్ కు తోడుగా ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయ ఇతర నేతలు కూడా యాత్రలో పాల్గొంటారు. రాహుల్ ఇటీవలే బ్యాంకాక్ వెళ్లడం తెలిసిందే. అక్కడ కొన్ని వారాల పాటు ధ్యాన కేంద్రంలో గడిపి వచ్చారు.