: శాంతించిన వరుణుడు... నైట్ రైడర్స్ లక్ష్యం కుదింపు
వైజాగ్ లో వర్షం ఆగిపోయింది. దీంతో, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ పునఃప్రారంభమైంది. వరుణుడి ఆటంకం కారణంగా ఓవర్లను కుదించారు. నైట్ రైడర్స్ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 118 గా నిర్దేశించారు. ప్రస్తుతం నైట్ రైడర్స్ జట్టు 4 ఓవర్లు ముగిసేసరికి గంభీర్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఓపెనర్ ఊతప్ప (14 బంతుల్లో 29 బ్యాటింగ్) ధాటిగా ఆడుతున్నాడు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 48 బంతుల్లో 83 పరుగులు చేయాలి.