: వైజాగ్ లో వర్షం... నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచ్
విశాఖపట్నలో వర్షం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ కు అంతరాయం కలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇన్నింగ్ ముగిసిన కాసేపటికి వర్షం ప్రారంభం కావడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉంది. వర్షం కురుస్తూనే ఉండడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.