: గంటా, అయ్యన్నకు చంద్రబాబు క్లాస్


భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వ్యవహారంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. రాజధాని భూసేకరణ ప్రక్రియ సవ్యంగా సాగిందని, అలాంటప్పుడు ఎయిర్ పోర్టు భూసేకరణ వ్యవహారం ఎందుకు జటిలమైందని చంద్రబాబు మంత్రులిద్దరినీ ప్రశ్నించారు. చొరవ తీసుకుని ఎందుకు రైతులతో మాట్లాడరని వారిని నిలదీశారు. రైతులను ఒప్పించే బాధ్యత వారిద్దరిదేనని స్పష్టం చేశారు. అనవసర రాజకీయాలు పక్కనబెట్టాలని హెచ్చరించారు. గతంలోనూ చంద్రబాబు వీరిరువురికి హితవు పలికిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News