: శివసేన వ్యతిరేకతతో పూణేలో పాకిస్థాన్ గాయకుడి సంగీత కార్యక్రమం రద్దు
పాకిస్థాన్ గాయకుడు, నటుడు అతిఫ్ అస్లామ్ ఈ నెల 25న పూణేలో ఓ సంగీత కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. శివసేన పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం రద్దైంది. భారత్ లో అధిక సంఖ్యలో అభిమానులున్న అతిఫ్ కార్యక్రమం అనుకోకుండా క్యాన్సిల్ అవడంతో అమ్ముడైన వెయ్యి టికెట్లకు డబ్బు వాపసు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. "శివసేన వ్యతిరేకించడం వల్ల ఈ షోను మేము నిర్వహించలేము. దివంగత బాల్ థాకరే మాకెప్పుడూ ప్రోత్సాహం ఇచ్చేవారు. దేశభక్తి అనేది అన్నిటికి అతీతమైనదని ఆయనెప్పుడూ అంటుండేవారు" అని షో నిర్వాహకుడు సంజయ్ సాథే మీడియాతో అన్నారు.