: ఇకపై 48 గంటల్లో పాన్ కార్డు ... ఆన్ లైన్ ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రయత్నం
ఇక నుంచి పాన్ కార్డు (పర్మినెంట్ అకౌంట్ నంబర్)ను 48 గంటల్లో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించి ఆన్ లైన్ సౌకర్యం తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. "దరఖాస్తుదారు నలభై ఎనిమిది గంటల్లో పాన్ కార్డు పొందేందుకు ఓ ఆన్ లైన్ సౌకర్యాన్ని తీసుకురాబోతున్నారు. దాని ద్వారా దరఖాస్తు చేసిన వ్యక్తికి ఆ సమయంలోగా కార్డు అందుతుంది" అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పాన్ కార్డు పొందే విషయంలో ప్రజలకు సహాయం చేసేందుకు గ్రామీణ ప్రాంతాలు సహా దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించనుంది.