: శాంసంగ్ వస్తోంది... మా వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలి: కేసీఆర్


బహుళజాతి సంస్థ శాంసంగ్ తెలంగాణలో హార్డ్ వేర్ పార్క్ నెలకొల్పుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని అన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా నూతన యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ... అనేక ప్రపంచస్థాయి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని, అయితే, ఉద్యోగాలు తెలంగాణ వారికే ఇవ్వాలని అన్నారు. తెలంగాణ చాలా దెబ్బతిన్న ప్రాంతమని తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ అని, అందుకే తెలంగాణ పిల్లలకే ఉద్యోగాలు కల్పించాలని, పరిశ్రమల యాజమాన్యాలు ఏది కోరినా కాదనకుండా చేస్తున్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News