: హైదరాబాదు కేంద్రంగా 'విస్తారా' ఎయిర్ లైన్స్ సేవలు... కేటీఆర్ తో భేటీలో సంస్థ సీఈఓ వెల్లడి
టాటాల ఆధ్వర్యంలో గగనతల యానంలో అడుగుపెట్టిన 'విస్తారా' ఎయిర్ లైన్స్ ఇకపై హైదరాబాదు కేంద్రంగానే కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు సంస్థ సీఈఓ ఫీ టీక్ యో కొద్దిసేపటి క్రితం తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, హైదరాబాదులో ఎయిర్ లైన్స్ కార్యకలాపాలకు సంబంధించిన పలు అనుకూల అంశాలను కేటీఆర్, ఫీ టీక్ యోకు వివరించారు. అంతేకాక హైదరాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఫీ టీక్ యో, హైదరాబాదు నుంచి సేవలను నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే సంస్ధ కార్యాలయాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన కేటీఆర్ కు చెప్పినట్లు సమాచారం.