: కిలో బంగారం, 5 కిలోల వెండి, రూ.7 లక్షల నగదు... కరీంనగర్ లో భారీ దోపిడీ!
కరీంనగర్ లో నేటి ఉదయం భారీ చోరీ వెలుగు చూసింది. నగరంలోని సెంటినరీ కాలనీకి చెందిన ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దొంగలు భారీ ఎత్తున నగలు, నగదును ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన నగల దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకుని నోరెళ్లబెట్టారు. నగల దుకాణంలోని కిలో బంగారం, ఐదు కిలోల వెండితో పాటు రూ.7 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారట. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు.