: ఏపీలో ఎస్సై ఆత్మహత్య... డీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలే తన చావుకు కారణమని సూసైడ్ నోట్!


ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లా వంగర ఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ ఏసీబీకి పట్టుబడ్డ పోలీసు అధికారి వీరాంజనేయులు నేటి ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం రైల్వే లైను వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహం వద్ద ఆయన రాసిన సూసైడ్ నోట్ లభించింది. తన సొంత శాఖలో పనిచేస్తున్న డీఎస్పీ, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, ఎమ్మెల్యే పీఏ నాయుడులే తన ఆత్మహత్యకు కారణమని వీరాంజనేయులు ఆరోపించారు. నిజాయతీగా పనిచేస్తున్న తనను అకారణంగా ఏసీబీకి పట్టిచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం ఏసీబీకి పట్టుబడ్డ వీరాంజనేయులు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. తాజాగా నిన్న ఆయనకు ఏసీబీ నుంచి నోటీసులు అందాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సూసైడ్ నోట్ ను స్వాదీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News