: తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మొత్తం 4,31,363 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా, 2,39,954 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పాస్ శాతం 55.62 గా నమోదైంది. గత రెండేళ్ల కంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందని, ఈసారి బాలికలే పైచేయిగా నిలిచారని మంత్రి కడియం తెలిపారు.