: అశోక్ గజపతిరాజుపై రాబర్ట్ వాద్రా అక్కసు... వంచనే వారి పరమావధి అంటూ వ్యాఖ్య


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, హర్యానా భూ కుంభకోణం సూత్రధారి రాబర్ట్ వాద్రా... టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు ఆయన ఫేస్ బుక్ ను వేదికగా చేసుకున్నారు. విమానాశ్రయాల్లో వీఐపీ హోదా కోల్పోయిన ఆయన, తొలుత సానుకూలంగానే స్పందించినా, నిత్యం ఎయిర్ పోర్టుల్లో తనిఖీల నేపథ్యంలో సహనం కోల్పోయారు. ‘‘అధికారులు ఆదేశిస్తే కోటులు తొలగించాం. బెల్టులూ తీసేశాం. కాని ఘనత వహించిన మంత్రిగా ఉంటూ అన్ని భద్రతా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తామంటున్నారు. బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వంచనే వారి పరమావధి’’ అని వాద్రా తన అక్కసు వెళ్లగక్కారు.

  • Loading...

More Telugu News