: విశాఖలో విమానాశ్రయం ఉండగా... భోగాపురం ఎయిర్ పోర్టు ఎందుకు?: సర్కారుకు జగన్ ప్రశ్న
విశాఖపట్నంలో విమానాశ్రయం ఉండగా, విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం ఎందుకని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన నేటి ఉదయం ఏపీ సర్కారును సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జగన్, కొద్దిసేపటి క్రితం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, ఎయిర్ పోర్టు పేరిట భోగాపురంలో 15 వేల ఎకరాలను సేకరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఎయిర్ పోర్టు పెట్టుకుని, మళ్లీ భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్న సర్కారు యోచన దిక్కుమాలిన ఆలోచన అని ఆయన విమర్శించారు.