: పోలీసు బాసులపై ఉగ్రవాదుల గురి... ఐబీ వార్నింగ్ తో నల్గొండ జిల్లాలో హై అలర్ట్!
కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్, అతడి గ్యాంగ్ ను మట్టుబెట్టిన పోలీసులపై ఉగ్రవాదులు కక్ష సాధించేందుకు రంగంలోకి దిగారట. వికార్ ఎన్ కౌంటర్ కు వ్యూహ రచన చేసిందెవరు? ఎన్ కౌంటర్ కు నేతృత్వం వహించిందెవరు? అన్న విషయాలపై ఉగ్రవాదులు సమగ్ర వివరాలు సేకరించారట. ఇంకేముంది, ఎన్ కౌంటర్ బాధ్యులపై దాడులకు ఉగ్రవాదులు రంగంలోకి దిగారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం సేకరించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తెలంగాణ పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. పోలీసు ఉన్నతాధికారులకు ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేసింది. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు నల్గొండ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.