: నేను దేశానికి ఆడుతున్నా, చెన్నైకి ఆడుతున్నా ఆమె లెక్క చేయడం లేదు: ధోనీ
ఓ బిడ్డకు తండ్రయితే వ్యక్తుల జీవితాల్లో మార్పు వస్తుందంటున్నాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తన కుమార్తె జివా కూడా తన జీవితంలో అలాంటి మార్పే తీసుకువచ్చిందని చెప్పాడు. ఓ ప్రశ్నకు జవాబిస్తూ... తాను దేశానికి ఆడుతున్నా, చెన్నై జట్టుకు ఆడుతున్నా తన కుమార్తె అస్సలు లక్ష్యపెట్టడం లేదని, ఆమె ధోరణి ఆమెదేనని, ఏడ్వాలనుకుంటే ఏడ్చేస్తుందని మురిపెంగా చెప్పుకొచ్చాడు. ఏదేమైనా, మధురమైన అనుభూతి అని పేర్కొన్నాడు. కుమార్తె పుట్టే క్షణాల్లో తాను భారత్ లో లేనని, భూమ్మీద పడ్డప్పుడు తాను ఆమెను చూడలేదని చెప్పాడు. అదో కఠిన సమమయం అని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ కు ముందర ధోనీ తండ్రయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ధోనీ భార్య సాక్షి ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది.