: బసవ జయంతి రోజున చనిపోయిందని ఎద్దుకు అంత్యక్రియలు


బసవ జయంతి రోజున చనిపోయిన ఓ ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు తెలంగాణలోని నారాయణఖేడ్ మండలం అబ్యంద వాసులు. గ్రామానికి చెందిన రైతు కల్లయ్య స్వామికి చెందిన ఈ ఎద్దుకు పాతికేళ్లు. వారికి చెందిన ఆవుకే పుట్టిన ఈ వృషభ రాజం వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది. కొంతకాలంగా ఇది అనారోగ్యంతో బాధపడుతూ వుంది. అయితే, పరిస్థితి విషమించడంతో నేటి మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. బసవ జయంతి నాడు చనిపోవడం పుణ్యప్రదమని భావించిన కల్లయ్యస్వామి కుటుంబ సభ్యులు దానిని ఎద్దుల బండిపై ఊరేగింపుగా తమ వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లి అక్కడ ఖననం చేశారు. ఆచారబద్ధంగా ఈ అంత్యక్రియల తంతు నిర్వహించారు.

  • Loading...

More Telugu News