: తెలంగాణలో ఉపాధి హామీ కూలీ రూ.180కు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజు కూలీ రూ.180కు పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కూలీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పెంపు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానుంది.