: వీళ్లా ఆదర్శ రైతులు?... సొంత వ్యాపారాల కోసమే ఇజ్రాయెల్ వెళుతున్నారు: ఎర్రబెల్లి


ఇజ్రాయెల్ లో జరగనున్న అగ్రికల్చర్ సంబంధ ఎగ్జిబిషన్ కు తెలంగాణ సర్కారు పలువురు ఎమ్మెల్యేలను పంపిస్తుండడంపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విరుచుకుపడ్డారు. ఏనుగు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, కమలాకర్, మనోహర్ రెడ్డిలు ఇజ్రాయెల్ వెళుతున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు. వారిని ఉద్దేశించి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఆదర్శ రైతులు కారని, ఆ ముసుగులో ఇజ్రాయెల్ వెళ్లి వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కమలాకర్ కు మైనింగ్ వ్యాపారం ఉందని, విద్యాసాగర్ రావుకు 'రియల్' బిజినెస్ ఉందని వివరించారు. ఆదర్శ రైతుల్లా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిగ్గుండాలని అన్నారు.

  • Loading...

More Telugu News