: 210 పాయింట్లు పతనమైన మార్కెట్ - రూ. 400 తగ్గిన బంగారం ధర


అక్షయ తృతీయ పర్వదినం నాడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గింది. నేటి న్యూఢిల్లీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ సెషన్లో బంగారం ధర రూ. 26,800కు పడిపోయింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదవ సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 210 పాయింట్లు పడిపోయి 27,677 వద్ద కొనసాగింది. దీంతో గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా దిగజారినట్లయింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 8,378 పాయింట్లకు చేరింది. కీలకమైన 8,400 పాయింట్ల వద్ద నిఫ్టీకి కొనుగోలు మద్దతు లభించక పోవడంతో మరింత పతనం పొంచివున్నట్టు భావించవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ సెషన్లో సెసా స్టెరిలైట్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా తదితర కంపెనీల ఈక్విటీ వాటాల విలువ పెరుగగా, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకీ, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీల ఈక్విటీ పడిపోయింది.

  • Loading...

More Telugu News