: మళ్లీ ఫోన్ మార్కెట్లోకి నోకియా!... ఫ్యాన్స్ కు శుభవార్తే
నోకియా బ్రాండ్ నేమ్ విలువ ఖరీదు కట్టలేం! ఈ ఫిన్లాండ్ దిగ్గజం 2013లో మొబైల్ ఫోన్ల తయారీ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కు విక్రయించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అభిమానులైతే తీవ్రంగా నిరాశచెందారు. ఆ సమయంలో ఆపిల్, శాంసంగ్ ల నుంచి ఎదురైన తీవ్ర పోటీని తట్టుకోలేక నోకియా వెనుకబడింది. నోకియా నుంచి కొనుగోలు చేసిన ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కూడా అంతంత మాత్రంగానే నడిపిస్తోంది. ఈ క్రమంలో, నోకియా తిరిగి ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. 2016లో పునరాగమనం చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే ఫ్రెంచ్ కమ్యూనికేషన్ సంస్థ అల్కాటెల్-లూసెంట్ ను కొనుగోలు చేసిన నోకియా మంచి ఊపుమీదుంది. అయితే, మొబైల్ సెగ్మెంట్లోకి తిరిగి వచ్చే విషయమై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకున్నా, పునరాగమనం చేస్తే మాత్రం ఆపిల్, శాంసంగ్ నుంచే కాకుండా చైనా దిగ్గజాలు షియోమీ, ఆసస్ నుంచి కూడా గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.